Wednesday 25 June 2014

అష్టాదశ శక్తి పీఠాల లోని ఆలంపురం జోగులాంబ ఆలయం::క్షేత్ర పురాణం::విశేషాలు:: శిల్పకళ

క్షేత్ర పురాణం:
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాల వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.
లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కాంచికాపురే /
ప్రద్యుమ్నే శృంఖలాదేవి , చాముండా క్రౌంచపట్టణే //

అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా /
కొల్హాపురే మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా //

ఉజ్జయిన్యాం మహాకాళి , పీఠికాయాం పురుహూతికా /
ఓఢ్యాణే గిరిజాదేవి , మాణిక్యా దక్షవాటికే //

హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి /
జ్వాలాయాం వైష్ణవిదేవి , గయా మాంగల్యగౌరికా //

వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరే తు సరస్వతి /
అష్టాదశ శక్తిపీఠాని , యోగినామపి దుర్లభం //

సాయంకాలే పఠేన్నిత్యం , సర్వశతృవినాశనం /
సర్వరోగహరం దివ్యం , సర్వసంపత్కరం శుభం //
ఈ రోజు మనం దర్శించే పుణ్యక్షేత్రం ఆ అష్టాదశ శక్తి పీఠంలోని క్షేత్రం..

అష్టాదశ శక్తి పీఠాల లోని ఆలంపురం జోగులాంబ ఆలయం:
అంతటి ప్రాశస్త్యం ఉంది గనుకనే ఈ ఆలయానికి ప్రాచీన హోదా కల్పించి తగిన పరిరక్షణకై Central government చర్యలు తీసుకోవడం జరిగింది.. అందుకే మనకు ద్వారం దగ్గరే  ఈ బోర్డు సాక్షాత్కరిస్తుంది




ఈ ప్రదేశంలో దేవి యొక్క పై దవడ ఇక్కడ పడిందట...
ఈ క్షేత్రంలో తల్లిని యోగులంబ అని, యోగాంబ అని చివరికి జోగులాంబ గా స్థిరపడిందని ప్రతీతి..
Jogulamba amma vaaru
shivalinga at jogulamba temple

బహమనీ సుల్తానుల దాడులలో (క్రీ. శ. 1480) పూర్వపు ఆలయం శిధిలమయిందట...తుష్కర మూకలు అమ్మవారి పూర్వపు ఆలయం పూర్తిగా నామ రూపాల్లేకుండా   ధ్వంసం చేసారు...
పూజారులు మాత్రం అమ్మ వారి విగ్రహాలను కాపాడ గలిగారు...
(చిత్రంలో దెబ్బతిన్న ఆలయకలశాన్ని చూపాను చూడండి)


Damaged Jogulamba temple 

దేవి ఇక్కడ చండి ముండి (బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో) రూపంలో ఉంటుంది...
బహమనీ సుల్తానులకు దొరకకుండా ఈ విగ్రహాలను పూజారులు జాగ్రత్తగా దాచారు...
 దేశానికే పేరెన్నిక గల ఒక శక్తి పీఠం తిరిగి పునరుద్ధరణకు నోచుకోవడానికి పట్టిన సమయమేంతో తెలుసా...
525 సంవత్సరాలు...
చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్తగా కట్టిన గుడిలో పునః ప్రతిష్ట చేసారు...

Jogulamba Temple, Alampur

తుష్కరులు కేవలం ధ్వంసం చేయటం తో ఆగలేదు.. ఆలయాన్ని ఆక్రమించుకుని ఒక దర్గాను కూడా స్థాపించారు... ఇప్పటికీ దీనిలో దర్గా నడుస్తుంది...
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మత పెద్దలందరినీ ఒప్పించి... దర్గా ను ఒక చిన్న గదికి పరిమితం చేసారు...
 ఈ విషయం విన్న నాకు చాల బాధ కలిగింది...
కాని చంద్రబాబు ధన్య జీవి... చంద్రబాబు గురించి చెబుతూ ఆలయ పూజారి ''చంద్రబాబు తిరుమలలో హత్యాయత్నం నుండి తప్పించుకోటానికి తల్లి కృపే ప్రధాన కారణం``  అని చెప్పాడు....

 ఈ క్షేత్రం తుంగభద్రా నది ఒడ్డున ఉంది...
పూర్వం శ్రీశైలం ప్రాజెక్టు లో నీరు నిండితే ఈ ఆలయం మునిగి పోయేదట...
Jogulamba temple in water srisailam dam

దాదాపు ఊరు కూడా సగం మునిగి పోతుంది...
నది ప్రవాహ ప్రభావం ఆలయం మీద పడకుండా పెద్ద గోడ కట్టారు...ఆ గోడమీదనుండి రిజర్వాయర్ ను ఫోటో తీస్తే ఈ విధంగా కనపడుతుంది.

ఇక్కడ అమ్మవారిది ఉగ్ర రూపం...
అందుకే ఆ వేడిని తగ్గించటానికి చుట్టూ ఒక తటాకాన్ని నిర్మించారు...
Jogulamba temple, alampur



 ఇక్కడ బ్రహ్మ ప్రతిష్టించిన 9 ఆలయాలను నవబ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి... అవి..
NavaBrahma Temples, Jogulamba temple complex, alampur

1. తారక బ్రహ్మ ఆలయం
2. స్వర్గ బ్రహ్మ ఆలయం
3. పద్మ బ్రహ్మ ఆలయం
4. బాల బ్రహ్మ ఆలయం
5. విశ్వ బ్రహ్మ ఆలయం
6. గరుడ బ్రహ్మ ఆలయం
7.కుమార బ్రహ్మ ఆలయం
8.ఆర్క బ్రహ్మ ఆలయం
9. వీర బ్రహ్మ ఆలయం
ఈ ఆలయంలో చాల ఉపాలయాలు చాల ఉన్నాయి..
చాల విశాల ప్రాంగణం...
Jogulamba temple complex, alampur

ఈ ఆలయ శిల్పకళ చాల బావున్నాయి.. 2 కళ్ళు చాలవు..
NavaBrahma Temples, Jogulamba temple complex, alampur

ఈ ఆలయ శిల్పాలను చూస్తూ...
ద్వారలపై భాగంలో బ్రహ్మ లోకం, విష్ణులోకం, శివలోకం అనే మూడు శిల్పాలు పై కప్పు పై చెక్క బడ్డాయి.. చాలా బావుంటుంది చూడండి...



ఇంకా సూర్యనారాయణ స్వామి ఆలయం,
నరసింహ స్వామి ఆలయం ఉన్నాయి...
వీటిని శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు..

ఈ క్షేత్రం కర్నూల్ నుండి కేవలం 25 కి.మీ.దూరంలో, హైదరాబాదు నుండి 200 కి.మీ. దూరంలో ఉంది..

మీరు మీ శ్రీశైల యాత్రను రెండు రోజులుగా ప్లాన్ చేసుకుంటే యాగంటి వరకు చూడవచ్చు...
మూడు రోజులుగా ప్లాన్ చేసుకుంటే జోగులాంబ వరకు చూడవచ్చు.. దానిని ఎలా ప్లాన్ చేసుకోవచ్చో తెలిపే ప్రణాళిక:
శ్రీశైల యాత్రలో ఒక భాగంగా దీనిని చూడవచ్చు..
1. శ్రీశైలం లో ఒక రాత్రి బస(నిద్ర) చేయాలి..తెల్ల వారు ఝామున ఐదు గంటలకు మహానందికి బస్సు సౌకర్యం కలదు.. దాని ద్వారా మహానందికి ఉదయం పది గంటలలోపే చేరుకోవచ్చు...
మహానంది కు ShriSailam - 172 KM - 3.5 hr.

2.మహానంది నుండి అహోబిలానికి ట్యాక్సి మాట్లాడుకుంటే బావుంటుంది.. ఎందుకంటే చాలా దూరం నుండి వచ్చిన వారికి ధనం/సౌకర్యంకన్నా కాలం విలువైనది.. మనం భోజనం 1:00pm కల్లా ముగించుకుని తిరిగి అక్కడి నుండి బయలు దేరగలిగితే ఎగువ/దిగువ అహోబిలాలను చూసుకోవచ్చు...
మహానంది అందరి మూదు గుడి నుండి (ఆళ్లగడ్డ వయా) - 1.5 hr (62 Km)
వాస్తవంగా ఇక్కడ నవ అహోబిలాలు ఉంటాయి కానీ ప్రయాణానికి చూడడానికి అనువైనవి... పై రెండే.. మిగిలినవి అడవిలో ఉంటాయి..

3. మన ట్యాక్సి యాగంటి వరకు మాట్లాడుకుంటే సరిపోతుంది... ఎందుకంటే శ్రీశైలం చూసినతర్వాత... ఉదయాన్నే మహానంది, మధ్యాహ్నం లోపు అహోబిలం చూసినవారికి సాయంత్రం యాగంటి చూసే భాగ్యం దొరుకుతుంది..యాగంటికి వెళ్ళే సరికి చీకటి పడిపోతుంది...
(ఆళ్లగడ్డ వయా) - - Yaganti కు అందరి మూదు గుడి 1hr 45min (82 Km)
యాగంటిలో ఖచ్చితంగా రాత్రి బస చేసేందుకు ప్రయత్నించండి... యాగంటి క్షేత్రాన్ని రాత్రి మరియు పగలు రెండు వేళల్లో చూడడం గొప్ప అదృష్టం... యాగంటి క్షేత్రమునకు సంబంధించిన లింకు

యాగంటి క్షేత్రానికి సంబంధించిన యాత్ర విశేషాల లింకు

4. యాగంటి నుండి తెల్ల వారు ఝామున పునర్దర్శనం చేసుకుని బనగాన పల్లి కి చేరుకుంటాము
బనగాన పల్లె లో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు నివసించిన (అచ్చమాంబ) ఇల్లు, కాలం జ్ఞానం వ్రాసిన బావి ఉన్నాయి...
Yaganti వ్యవసాయమే పల్లెబాట 12 km - 16 min.

5.మహానంది నుండి మార్గమధ్యంలో ఓంకారం అనే అమ్మవారి గుడి ఉంటుంది... ఇది మంచి శక్తివంతమైన ఆలయం దర్శించడం మర్చిపోవద్దు..

6.బెలూంగుహలు(ఈరెండు స్థలాలు వేర్వేరు ప్రదేశాలలో ఉంటాయి.. ఒకేసారి రెండిటినీ చూడడం కుదరదు) మార్గమధ్యంలో అరుంధతి సినిమా షూటింగ్ తీసిన గద్వాల కోట కనపడుతుంది.. చూడండి...
(పైన పేర్కొన్న వాటిలో 5,6, అనేవి కొంచెం ఎడంగా ఉండే ప్రదేశాలు ఒకేరోజులో చూడడం కుదరవు.. మీరు ఇంకొంచెం ప్లాన్ చేసుకుంటే కుదరవచ్చేమో.. ప్రయత్నించండి..)

మేము ఈ క్షేత్రాలను(5,6మినహా) దర్శించి తిరుగు టపాలో కర్నూలు చేరుకుని అక్కడి నుండి ఆలంపురం, జోగులాంబ ఆలయాన్ని దర్శించాం..
ఆలంపుర్, జోగులాంబ ఆలయానికి సంబధించిన లింకు

కర్నూలు నుండి ఎవరి ఇంటికి వారు బయలుదేరాం...

సర్వే జనాసుఖినోభవంతు!!! లోకా సమస్తా సుఖినోభవంతు!!

యాత్రను ఈ క్రింది విధంగా ప్లాన్ చేసుకోవచ్చు:

శ్రీశైలం నుండి మహానంది కు  - 172 KM - 3.5 hr.
మహానంది నుండి అహోబిలం (ఆళ్లగడ్డ వయా) - 1.5 hr (62 Km)
అహోబిలం నుండి యాగంటి(ఆళ్లగడ్డ వయా) - -  1hr 45min (82 Km)
యాగంటి నుండి బనగాన పల్లె 12 km - 16 min.
బనగాన పల్లె నుండి ఆలంపూర్ (వయా కర్నూలు) 98 km - - 2 hr 

ఆలంపుర్, జోగులాంబ ఆలయానికి సంబధించిన లింకు
యాగంటి ఆలయానికి సంభంధించిన లింకు

Post a Comment

Whatsapp Button works on Mobile Device only