Friday 21 February 2014

తెలుగు జాతి... అది ఆంద్రా అయినా, తెలంగాణా అయినా, రాయలసీమ అయినా సరే.. మనం ఏం చేయగలమో చిన్న వివరణ....

తెలుగు జాతి... అది ఆంద్రా అయినా, తెలంగాణా అయినా, రాయలసీమ అయినా సరే..
మనం ఏం చేయగలమో చిన్న వివరణ:
ఈ టపాలో మొత్తం ౩ ప్రాంతాల వారిని కవర్ చేసాను దయచేసి రంధ్రాలు వెతకకండి:
ఆంధ్రా ప్రాంతపు ప్రకృతివనరులు.. వ్యావసాయిక ప్రగతిని, అంతులేని కోస్తా తీరంనుండి తరంగ విద్యుత్తును, జల విద్యుత్తును ఉత్పత్తి చేసి మిగులు విద్యుత్తు మన దేశానికి అందించ గలిగితే ఖచ్చితంగా.. ఆంద్రప్రదేశ్ పురోగమిస్తుంది... ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాదు లేదు అనే భావన తొలగించుకొని ఇంకొక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకుంటే ఖచ్చితంగా గాడిలో పడటానికి ఎంతో సమయం పట్టదు... జల వనరుల గురించి దిగులు చెందనవసరం లేదు ఎందుకంటే కోస్తా ఆంధ్రా మొత్తం దిగువ ప్రాంతంలో ఉంది.. అందువల్ల వచ్చే జల వనరుల నాపటం ఎవరి తరం కాదు.. అంతటి ఆలమాట్టి డ్యామునే దాటుకోని రాలేగా లేనిది.. ఇకపై సమస్య వస్తుందని అనుకోను.. ఇక్కడ సాగర్ టేక్ పాండ్, కొన్ని ఏరియాలలో సౌర విద్యుత్, కొన్ని ప్రదేశాలలో అంటే గుంటూరు, చీరాలలో వస్త్రపరిశ్రమ, రంగుల అద్దకం, కాంపోజిట్ స్పిన్నింగు మిల్లులు, సుబాబులు పండే ప్రదేశాలకు (నందిగామ) దగ్గరగా కాగితం పరిశ్రమలు, జగ్గయ్య పేటకు సమీపంలో మరికొన్ని సిమెంటు పరిశ్రమలు ప్రోత్సహించవచ్చు.. అపార సముద్ర వనరులు తరంగ విద్యుత్తు , నౌకా నిర్మాణ రంగానికి అనుకూలంగా ఉంటుంది... ఇకపోతే రైలు, రోడ్డు మార్గాలు రాష్ట్రంలో ప్రతి 50 కి.మీ కనీస పరిధిలో కనెక్టివిటీ కలిగి ఉన్నాయి...  కాబట్టి అభివృద్ధికి ఢోకా లేదు..
అనంతపురం లాంటి జిల్లాలలో ఎటువంటి ఆశ లేదనుకోవద్దు.. అక్కడ పవన విద్యుత్తు, సౌర విద్యుత్తుకు సానుకూలం... కొన్ని ప్లాంటులను ఏర్పాటు చేయవచ్చు... ఆ ప్రాంతమంతా పరిశ్రమలకు చాలా అనుకూలంగా ఉంటుంది... మిగిలిన ౩ జిల్లాలలో అంటే చిత్తురు, కర్నూలు, కడప ఏమంత సమస్యాత్మకం కాదు.. అక్కడ చాలా మౌలిక వనరులున్నాయి...
తెలంగాణా గురించి:
సోదరులారా... ఏ ఉద్యమమూ ఊరికే just like that జరుగదు... ఒక్కసారి మెదక్ జిల్లా చూస్తే ఇంకా విద్యకు నోచుకోని ఎన్నో తండాలు దర్శనమిస్తాయి... మున్సిపాలిటీ అయిన సదాశివపేటలో మంచి చెప్పులు దొరికే పరిస్థితి కూడా లేదు... ఇక ఎలక్ట్రానిక్, భోజన హోటళ్ళ , మిగిలిన మౌలిక వసతులు, వాటి పరిస్థితి వివరించనే అక్కరలేదు... నేషనల్ హైవే మీద ఉన్న ఈ పట్టణమే ఇలా ఉంటే ఇక లోపల ఊర్ల విషయం అస్సలు చెప్పనే చెప్పలేము...
కానీ ఆంధ్రా లో ఆ పరిస్థితి లేదు... కనీస గ్రామ పంచాయతీ కూడా కాని హనుమాన్ జంక్షన్, పామర్రు, లాంటి చిన్న చిన్న ఊర్లలో కూడా మనం ఏర్ కూలర్, ఏసిరిపేర్ షాపులు చూడగలం... (నేను ఈరెంటికి ఎందుకు పోలుస్తున్నానంటే సదాశివపేట హైదరాబాదు శివారు పట్టణం, పామర్రు, హనుమాన్ జంక్షన్లు విజయవాడ శివారు పట్టాణాలు) అభివృద్ధి లో చాలా చాలా  వ్యత్యాసముంది... ప్రాంతాల మధ్య ఇంత గ్యాప్ ఖచ్చితంగా వైషమ్యాలకు దారితీస్తుందని ముందు తరం పాలకులు గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే న్ని సమస్యలు తలెత్తేవే కావు.
తెలంగాణా వాసుల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆగిపోకూడదు.. తెలంగాణాలో భూస్వామిక, నైజాం ప్రభువుల నిరంకుశత్వం వల్ల హిందువుల/సామాన్య మానవుల ప్రగతి చాలా మందగించింది... బాగా గమనించండి... చాలా విప్లవాలు ట్రేడ్ యూనియన్లు, అన్నలు, తీవ్రవాదులు ఉద్భవించింది ఈ ప్రధాన తారతమ్యాల వలననే... తెలంగాణా వచ్చిన తర్వాత అది తిరిగి ఊపందుకోకూడదు.. 
ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు అక్కడ లేవు.. కానీ 100 అడుగుల లోతు తవ్వితే అపారమయిన జల సంపద తీసుకోవచ్చు... ఇక్కడ చీడపీడలు లేని పంటలు పండుతాయి.. కష్టానికి తగ్గట్లు... దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిస్తే ఇక తిరుగులేదు..వ్యవసాయ పద్ధతుల గురించి.. నవీన సాగు పద్ధతుల గురించి  కొంత సాయం మన మిగిలిన తెలుగు మిత్రుల నుండి నేర్చుకుంటే తప్పు లేదు,, ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడె అవకాశం లేదు.. కాబట్టి పారిశ్రామికంగా ఎదిగేందుకు ప్రయత్నించాలి... ఉద్యోగ, ఆహార ఉత్పత్తుల, విషయంలో ఆంధ్రా పారిశ్రామిక వేత్తలను అహ్వానించి పరిశ్రమలను నెలకొల్పటంలో తప్పు లేదు... ఎందుకంటే వాటి వల్ల మౌలిక వనరుల పెరుగుదలే గానీ తరుగుదల ఏర్పడదు.. ఉద్యోగాలు పెరుగుతాయి..
సమస్య ఏమిటంటే రాష్ట్రమంతా ఎగువ ప్రాంతంలో ఉంది.. అందువల్ల... డ్యాముల మీద ఆధారపడలేము... విద్యుత్ ఇబ్బందులు తలఎత్తవచ్చు... ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్లా లాంటి ప్రత్తికి అనువయిన పట్టణాలలో కొన్ని మౌలిక వసతులు కల్పించగలిగితే అక్కడ జౌళి పరిశ్రమ, వస్త్ర ఉత్పత్తులు పెరిగి మౌలిక వనరుల వినియోగం , ఉద్యోగ, మానవ వనరుల సదుపాయం పెరుగ గలవు..
నాగార్జునా సాగర్ నుండి మొదలుకుని నల్లగొండ జిల్లా చాలా వరకు సిమెంటు పరిశ్రమ విస్తరించి ఉన్నది... దానిని ఇంకా అభివృద్ధి చేయవచ్చు...
మనకు ఎదురయ్యే ప్రధాన శత్రువు విద్యుత్, అందుకే గుజరాత్ తరహా సౌర విద్యుత్ ను ప్రోత్సహించ గలిగితే కరెంటు కష్టాలు తీరుతాయి.. ప్రతి గృహంలో వారికి అవసరమయిన విద్యుత్ తయారు చేసుకోవడమే కాక మిగిలిన విద్యుత్ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వగలిగే విధంగా ప్రణాళికలు రచించగలిగితే చాలా సమస్యలు తీరతాయి.. రైతులు ఉచిత విద్యుత్తు, విద్యార్ధులు ఉచిత ఇంజనీరింగు, కిలో బియ్యం ఒక రూపాయి (ప్రభుత్వ మద్దతు ధరే 20రూ ఉంది.. ఇది ఎలా సాధ్యం) లాంటివి చాలా ఖర్చుతో కూడిన పధకాలు వీటిని ప్రోత్సహించాలా లేదా అనేది తర్వాతి ప్రభుత్వం ఏర్పరచే వారికి కొంచెం కత్తి మీద సామే... ఏమయినా ప్రజలు ఇటువంటి వాటిని ప్రోత్సహించకపోతేనే మంచిది.. ఎందుకంటె వాటి మీద ఖర్చును తిరిగి మనమే పన్నుల రూపంలో కట్టే బాధ తప్పుతుంది... మనం ఒక ప్రక్క ఇవన్నీ కోరుకుంటూ మళ్ళీ ధరలు పెరుగుతున్నాయి అనుకోవడంలో అర్ధమే లేదు..
నేను కేవలం ప్లస్ పాయింట్లు మాత్రమే కవర్ చేసాను.. కొన్ని మైనస్ పాయింట్లకు చిన్న చిన్న సూచనలు, ఎక్కడ అభివృద్ధి చేయగలమో వివరించాను... వీటిలో ధర్మల్ కారాగారాల గురించి, విద్యుత్ ప్లాంట్ల గురించి ప్రస్థావించలేదు.. ఇంకా చాలా ఉన్నాయి.. అవన్నీ ఒక్క టపాలో కవర్ చేయలేము... కేవలం మధ్య తరగతి మామూలు ఉద్యోగికే ఇన్ని ఆలోచనలుంటే మన కలెక్టర్లకు, అధికారులకు ఎన్ని ఆలోచనలుండాలి... వారిని వారి పని చేయనిస్తే... అందరికీ... అంతా శుభమే జరుగుతుంది... దయచేసి దీనిలో రంధ్రాలు వెతకకండి... ఈ టపాకు ప్రాంతాలకు సంబందం లేదు.. ఈ టపా మన తెలుగు సోదరులందరిదీ.. రాష్ట్రాలుగా విడిపోయినా సోదరులుగా కలిసుండటం లో తప్పు లేదు...
జైహింద్... జై భరత్
శ్రీరాగ




  1. Very good analysis..some people has to form a group and educate lower level people..This generation has lot of courage to do good things..as per my observation people has to change their mindsets...
    1. Telugu people proved that, we can built new communities and compete with world, hyderabad is the best example.
    2. Stop criticizing each other and work as one team to move forward.
    3. No need to rush for new capital..it's government responsibility to built all required infra..
    4. we have to educate our next generation about greatness of telugu people, involve them in future developments.
    5. all are equal in telugu land, we have to start practicing these and helping each other for good cause.
    6. Gujarat and Israel are good examples..
    7. In my opinion Chandrababu is the best option to make our place flourish with new developments.
    8. Instead of IT we have to think about other future developments..
    9. Hyderabad is going to reach it's break even point, people start thinking about beach homes soon. AP is next possible destination for better living.
    10. Taking education to next level..we have great professors and lecturers to nourish future generations.
    11. Every telugu person think about his mother land and adopt few villages and schools to nourish future generation.
    12. Giving moral support to other telugu/indian all the time..

    just my thoughts...it's better to form new group for "Better and Bright AP" for future generations..lot of people are ready to contribute their work..

    ReplyDelete
  2. good report and genuine report.
    visit me at
    www.menavachaitanayam.blogspot.com

    ReplyDelete
  3. ఆర్యా, నా అభిప్రాయాల్ని ఇక్కడ ఒక వ్యాఖ్యలో చెప్పటం నిడివి ధృష్ట్యా సాధ్యపడక ఒక టపాగా వ్రాసాను. పరిశీలించండి తెలుగువారం ఏం చేయ గలమో ఇప్పుడు! టపాను.

    ReplyDelete
  4. Excerpt from another blog..
    నిర్లక్ష్యానికి గురై కునారిల్లుతున్న తెలుగు భాషకు ప్రాణవాయువునందించి ప్రాణం నిలుపుతున్న మంచివారు ఇంకా ఉన్నారు. కాబట్టే తెలుగు భాష ఇంకా బ్రతికి ఉన్నది. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్రాతకోతల వ్యవహారాలు తెలుగులోనే జరుగుతున్నాయి. ఫైళ్లు ఆంగ్లంలో ఉంటే కలెక్టరు గారు వాటిని చూడరు. లేఖలు అన్నీ తెలుగులో ఉండాలని పట్టుపడతారాయన. ఇది ఒకప్పటి విషయం.

    ఇప్పటి కలెక్టర్ చిరంజీవులు క్రొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని ఆదేశాలిచ్చారు. పుష్పగుచ్చాలు, మిఠాయిలు ఎవ్వరూ తీసుకుని రాకూడదనీ, వాటికి మారుగా పలకలూ బలపాలూ తీసుకురావాలన్నారు. ఆ విధంగా వచ్చిన పలక-బలపాలను నిరక్షరాస్యులకు పంచి, వారు చదువు నేర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యం కోసం "మన కోసం మనం" అనే ప్రణాళిక చేపట్టారు. చదువు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్న నిరక్షరాస్యులు పలకలు బలపాలు ఇంకా కావాలని అడుగుతూ ఉండడం శుభపరిణామం.

    ReplyDelete
  5. Telugu vaaru emainaa cheyyagalaru..nijam .congress ki pattam kattagalaru........avasaramaithe bangalakhatham lo poodchi pettanuu galaru. Kaakapothe yuvatharam koncham nayakatvam vahinchi apramatham gaa vunte......mukhyam gaa kula gajji vadilchu ko galigithe Maname NO1...tadakha choopiddam.

    ReplyDelete

Whatsapp Button works on Mobile Device only